దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన
ఒంగోలుసిటీ: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయ కులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడు తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకపాలన సాగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసుల వల్ల రిమాండ్‌లో ఉన్న ఏడుగురు అమాయక యువకులను ఒంగోలులోని జిల్లా జైలులో గురువారం మేరుగు నాగార్జున కలిసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఏ సంబంధం లేని కూలి చేసుకునే యువకులను కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మనబ్రోలులో గేదె దగ్గర గొడవ అని తీసుకొచ్చి కేసులు పెట్టి ఏడుగురిని జైలుకు పంపించడం దారుణమన్నారు. అమ్మనబ్రోలులో సాయి అనే బీసీ యువకుడు వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు కట్టాడని, ఫ్లెక్సీల దగ్గర గొడవైందని, బూతులు తిట్టాడనే కారణంతో ఒక గిరిజన అమ్మాయితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి జైలుకు పంపడం దారుణమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని పోలీసు లు, కేసులు పెట్టేవారు, ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ నేతలపై కూడా ఇలాంటి కేసులు పెట్టే రోజులు వస్తాయని, అందువలన ఈ కేసులను దుర్వినియోగం చేసుకోవద్దని అన్నారు. పరిపాలనను గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీ కనిపిస్తే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ కట్టినందుకే
నా బిడ్డపై కుట్ర...
బాధితుడు సాయి తల్లి సలోమి మాట్లాడుతూ తన బిడ్డ వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీ కట్టినందుకు ఆ ఫ్లెక్సీ చించారని, తన బిడ్డను జైలుపాలు చేశా రని కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది.
దావోస్ పర్యటనలో
సీఎం చంద్రబాబు అట్టర్‌ప్లాప్
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు అట్టర్‌ప్లాప్ అయ్యారని మేరుగు నాగార్జున విమర్శించారు. పట్టుమని పది కోట్లు పెట్టుబడులు తేలేకపోవడం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం లక్షా 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందన్నారు. పవన్‌కళ్యాణ్‌ని సైడ్ చేసి లోకేష్‌ని ప్రమోట్ చేయడానికే చంద్రబాబు, లోకేష్ పర్యటన అని అన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన ద్వా రా ఏం సాధించారనే దానిపై పవన్ కల్యాణ్ నిలదీయాలన్నారు. మేరుగు నాగార్జున వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, కొమ్మూరు సుధాకర్, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, తేళ్ల పుల్లారావు, పోలినేని కోటేశ్వరరావు, కోయ హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
రిమాండ్‌లో ఉన్న యువకులకు పరామర్శ
మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment