ప్రజాప్రతినిధుల విన్నపాలు పరిష్కరించాలి
బాపట్ల: జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజాప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వ భూములను గుర్తించి ఫిబ్రవరి 28 నాటికి నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం ఇచ్చి వినియోగంలో లేని భూములను తిరిగి తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో శ్మశాన వాటికలకు అవసరమైన భూములను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన భూములు పరిశీలించి, నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లాలో సాగునీటి కాలువల మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి పథకాల మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల మండలంలో ఎత్తిపోతల పథకం ద్వారా 4,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. చీరాల కుందేరు కాలువ ఆక్రమణలు పరిశీలించాలని రెవెన్యూ, డ్రెయినేజీ అధికారులను ఆదేశించారు. మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి పరిశీలించాలని దేవాదాయ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా, బాపట్ల, చీరాల ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు.
తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేయాలి
బాపట్ల కలెక్టరేట్‌లో ప్రజల సౌకర్యం కోసం తాత్కాలిక షేడ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా సమస్యలపై వచ్చే ప్రజల కోసం టాయిలెట్స్, భోజన సదుపాయాలు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయల ప్రదర్శన, ఏర్పాటు చేయడానికి 4 రకాలు షేడ్స్ నిర్మించడానికి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment