గ్రామాలలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాలలో కేటాయించిన పనులలో 80 శాతం కంటే తక్కువగా ఉన్న మండలాలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలోపు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు రోజువారి లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో 681 గోకులాల నిర్మాణం లక్ష్యం కాగా 336 పూర్తి చేయగలిగామన్నారు. మిగిలిన లక్ష్యాలను నెలాఖరులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3045 నీటి కుంటలు ఏర్పాటు లక్ష్యంకాగా ఇప్పటికీ 411 ఏర్పాటుకు స్థలం నిర్దేశించడం జరిగిందన్నారు. ఎంఎస్‌ఎం ఈ సర్వేలో నిర్దేశిత లక్ష్యాలలో ఎక్కువ శాతం పూర్తి చేసిన మండల అధికారులను కలెక్టర్ అభినందించారు. జిల్లాలో 100 శాతం గృహాల జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.వి.విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ పద్మ, డీఎల్‌డీవో సీహెచ్ విజయలక్ష్మి, జీఎండీఐసీ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment