ప్రవచన సప్తాహ యజ్ఞం ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్‌గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంత్యుత్సవం సందర్భంగా తొమ్మిది రోజులపాటు జరగనున్న శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ యజ్ఞాన్ని గురువారం రాత్రి పండితుల వేదస్వస్తితో ప్రారంభించారు. ముప్పవరపు వెంకటసింహాచలశాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు రామాయణ నవాహ ప్రారంభకులు బాలకాండ మహాకవి డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ (హైదరాబాద్) ప్రవచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ జ్యూడిషియల్ అకాడమి (అమరావతి) ఎ.హరిహరనాథశర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment