పొన్నూరు: మండల పరిధి పచ్చలతాడిపర్రు గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం. తెనాలి మండలం చావావారిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పెరుగుమాల సుందరరావు, రత్నకుమారి తెనాలి నుంచి ద్విచక్ర వాహనంపై బాపట్ల వైపు వెళుతుండగా గుంటూరు నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నకుమారి (41) అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తకు స్వల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment