విధుల నుంచి తొలగించటంపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: పర్చూరు మండలం చెరుకూరు ఆంధ్రకేసరి మెమోరియల్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను తొలగించటంపై చర్యలు తీసుకోవాలని ఏపీ టీచర్స్ గిల్డ్ బాపట్ల, ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శులు జి.వెకంటేశ్వర్లు, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తంను గురువారం కలిసి వలంటీరి రిటైర్మెంట్ ఇవ్వలేదని ఉపాధ్యాయులు సీహెచ్ వెంకటేశ్వర్లు, కె.పద్మావతిలను గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి జీతాలు నిలుపుదల చేసిన యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్.పురుషోత్తంకు వినతిపత్రం అందించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజును కలిసి సమస్యను వివరిస్తామని తెలిపారు.
ఏషియన్ యోగాలో శ్రీకృష్ణకు బంగారు పతకం
గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం విద్యార్థులు చదువుతో పాటు తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ, అంతర్జాతీయస్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబర్చడం గర్వకారణంగా ఉందని విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. విజయవాడ అశోక్‌నగర్‌లోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి (ఐఐటీ) చదువుతున్న దేవరాజుగట్టు ధీరజ్ శ్రీకృష్ణ సింగపూర్‌లో ఈనెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన ఏషియన్ యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. బంగారు పతకంతోపాటు రెండు రజత, కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు చెప్పారు. ఏషియన్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో 47 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి బంగారు పతకం వచ్చిందని చెప్పారు. బాలుర జూనియర్ విభాగంలో తలపడిన ధీరజ్ శ్రీకృష్ణ ఆర్టిస్టిక్ యోగాలో బంగారు పతకం, యోగాసన, ఆర్టిస్టిక్ పెయిర్ యోగాసనలో రజతం, రిధమిక్ యోగాలో కాంస్య పతకాలు గెలుపొంది సత్తా చాటాడని వివరించారు. యోగాలో ప్రతిభను గుర్తించి గతంలో భాష్యం తరఫున రూ.లక్ష నగదు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ధీరజ్ శ్రీకృష్ణ తండ్రి నాగరాజు, తల్లి శశికళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment