పాఠ్యపుస్తకాల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీఈఓ వెంకటేశ్వరాచారి
కొత్తగూడెంఅర్బన్: ఆరేళ్లుగా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు జెడ్పీహెచ్‌ఎస్‌లో కొనసాగిస్తున్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని ఆనందఖని జెడ్పీహెచ్‌ఎస్‌కు మార్చారు. కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి ప్రారంభించి మాట్లాడారు. పాఠ్యపుస్తకాల సరఫరా కేంద్రం మార్పుతో జిల్లాలోని అన్ని మండలాలకు త్వరితగతిన పాఠ్యపుస్తకాలు చేరవయవచ్చని తెలిపారు. జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ ఎన్.సతీష్‌కుమార్, గోదాం ఇన్‌చార్జ్ ఎస్‌డి.రవిప్రతాప్, హెచ్‌ఎం జి.లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment