![వంద శ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/0000634766-000001-yashodahospita_mr-1738953543-0.jpg.webp?itok=HXuwHd_6)
వంద శాతం వసూలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ఇంటి పన్నులు, పంపు బిల్లులు వంద శాతం వసూలు చేయాలని మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మొండి బకాయిలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి, మేనేజర్ ప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్ రవీందర్, డీఈ రవికుమార్, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
![వంద శాతం వసూలు చేయాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07kgm371-192021_mr-1738953544-1.jpg)
వంద శాతం వసూలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment