![నలుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల అరెస్ట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07bcm82-192019_mr-1738953596-0.jpg.webp?itok=bHy-S-Am)
నలుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల అరెస్ట్
చర్ల: మావోయిస్టు పార్టీకి చెందిన ఒక ఏరియా కమిటీ సభ్యుడితో పాటు ముగ్గురు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ఎ.రాజువర్మ వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం చర్ల సివిల్, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్, 81 బెటాలియన్లకు చెందిన పోలీసులు తాలిపేరు ప్రాజెక్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యాన అటుగా వస్తున్న నలుగురు వ్యక్తులను ఆపి ప్రశ్నించే క్రమంలో పారిపోయేందుకు యత్నించగా.. వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తామంతా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్లు అంగీకరించారు. వీరిలో బీజాపూర్ జిల్లా పోలంపల్లి గ్రామానికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు గట్టుపల్లి ఊర అలియాస్ సోమన్న, సుకుమా జిల్లా చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొరేపాల్ గ్రామానికి చెందిన జేగురుగొండ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు మడకం ఉంగ, దంతెవాడ జిల్లా అల్నార్ గ్రామానికి చెందిన జేగురుగొండ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు కడితి లక్రే అలియాస్ మంజు, సుకుమా జిల్లా గొండపల్లి గ్రామానికి చెందిన పామేడు ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు సోడి సుక్కీ అలియాస్‌లు కాగా.. వారి వద్ద నుంచి పార్టీకి చెందిన 30 కరపత్రాలను స్వాధీనం చేసుకు కోర్డుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, 81 బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ అనీల్, చర్ల ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment