బాలుడి మర్మాంగాన్ని కొరికిన పెంపుడు కుక్క
భద్రాచలంఅర్బన్: నిద్రిస్తున్న బాలుడి మర్మాంగాన్ని పెంపుడు కుక్క కొరికిన ఘటన ఇది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట గ్రామంలో జరిగిన ఈ ఘటనలో బాలుడికి తీవ్ర రక్తస్రావం కాగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు వెట్టి లక్ష్మయ్య గురువారం సాయంత్రం దాటాక ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. దీంతో మేల్కొన్న ఆయన తీవ్రంగా రోదిస్తుండగా కుటుంబీకులు స్థానికంగా చికిత్స చేయించినా రక్తస్రావం ఆగలేదు. ఈమేరకు శుక్రవారం బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. లక్ష్మయ్యకు అన్ని పరీక్షలు నిర్వహించామని, వ్యాక్సిన్లు కూడా వేశామని.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స
Comments
Please login to add a commentAdd a comment