చర్ల: మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో ఇసుక క్వారీ ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ, మైనింగ్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు రాగా శుక్రవారం అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. ఇసుక క్వారీ ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేయడంతో అధికారులు సర్వే కోసం అక్కడకు వచ్చారు. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో రెండు గిరిజన మహిళా సొసైటీలు ఉండగా.. ఈ రెండింటికి కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. గతంలోనూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు రాగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విసయమై చర్ల తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీలో ఏర్పాటైన రెండు సొసైటీలకు సంబంధించి ఒక్కసారే సర్వే చేయాలని లేకుంటే రెండూ నిలుపుదల చేయాలని గిరిజనులు పట్టుబట్టడంతో సర్వేను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment