పీఏసీఎస్ చైర్మన్‌కు అనారోగ్యం
ఇల్లెందు: రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేశారనే అభియోగం ఎదుర్కొంటున్న టేకులపల్లి మండలం బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి ఇల్లెందు సబ్ జైలుకు తరలించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రంతా కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడుతూ డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో జైలు అధికారులు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి ఆయన ఆదేశాలతో ఇల్లెందు ప్రభుతాత్వాత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ విషయం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, దిండిగాల రాజేందర్, దాస్యం ప్రమోద్‌కుమార్ తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం వరకు సురేందర్ ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి సబ్ జైలుకు తరలించారు. ఈ మేరకు వివరాలను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్ అధిష్టానానికి వివరించారు. కాగా, జైలులో ఖైదీలే స్వయంగా వంటలు తయారు చేస్తుండగా కూరలో కారం ఎక్కువవడంతో అనారోగ్యం పాలైనట్లు ఆయన తెలిపారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment