క్రీడలతో మానసికోల్లాసం
కొత్తగూడెంఅర్బన్ : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. హేమచంద్రపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో గురువారం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్–2025 ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ శాఖ విభాగాల వారీగా చేసిన పరేడ్‌ను తిలకించారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే సిబ్బందికి ఆట విడుపు కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, షటిల్ బాడ్మింటన్, అథ్లెటిక్స్, పరుగు పందెం తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత హోంగార్డ్స్ టీమ్, పాల్వంచ సబ్ డివిజన్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్‌ను టాస్ వేసి ఎస్పీ ప్రారంభించారు. క్రికెట్ మ్యాచ్‌లో కొద్ది సేపు బౌలింగ్ చేసి సిబ్బందిని ఉత్సాహపరిచారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్పోర్ట్స్ మీట్‌లో ఎస్పీ రోహిత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment