![విద్యార్థినికి సర్టిఫికెట్ అందజేస్తున్న డీఈఓ - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/13/12kgm372-192021_mr_0.jpg.webp?itok=ef5800Ys)
విద్యార్థినికి సర్టిఫికెట్ అందజేస్తున్న డీఈఓ
కొత్తగూడెంఅర్బన్: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పరిసరాలపై విద్యార్థులకు అవగాహన, పరిశీలన, ఆసక్తి కలిగేలా ప్రేరేపించాలలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలు గెలుచుకున్న విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా పరిశీలకులుగా హాజరైన వి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈనెల 28న సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వివరించారు. జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కో – ఆర్డినేటర్ సంపత్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రావు, ఎస్.వెంకటేశ్వర్లు, న్యాయనిర్ణేతలు మధు, కళ్యాణి, అనురాధ పాల్గొన్నారు.
24 నుంచి డ్రాయింగ్, టైలరింగ్ పరీక్షలు
ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్, టైలరింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు జరుగనున్నాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివరాలకు ఏసీజీఈ ఎస్.మాధవరావు (99890 27943)ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment