కోల్ ఇండియా స్థాయిలో ప్రతిభ చూపాలి
మణుగూరుటౌన్: కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి విజయకేతనం ఎగురవేయాలని ఏరియా జీఎం దుర్గం రాంచందర్ అన్నారు. బుధవారం సింగరేణి కాలరీస్ డబ్ల్యూపీఎస్ అండ్ జీపీఏ ఆధ్వర్యంలో మణుగూరు భద్రాద్రి స్టేడియంలో హాకీ టోర్నమెంట్ ముగిసింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కార్మికులు యోగా, ధ్యానం, క్రీడల కోసం కొంత సమయం కేటాయించాలన్నారు. క్రీడాపోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన మందమర్రి బెల్లంపల్లి, రన్నరప్‌గా నిలిచిన శ్రీరాంపూర్ జట్లకు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో వై.రాంగోపాల్, కృష్ణంరాజు, శ్యాంసుందర్, సలగల రమేశ్, పాసినేట్, వెస్లీ, అశోక్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు ఉన్నారు.
డీఆర్‌యూసీసీ మెంబర్‌గా శ్రీనివాసరెడ్డి
ఖమ్మంవన్‌టౌన్: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) మెంబర్‌గా కొత్తగూడెంనకు చెందిన యరమల శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో నియమితులైన ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఎంపీని బుధవారం ఖమ్మంలో కలిసిన శ్రీనివాసరెడ్డి తన నియామకానికి సహకరించడంపై కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లాలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా రైల్వే బోర్డు సమావేశాల్లో చర్చించాలని ఎంపీ ఆయనకు సూచించారు. నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment