కాటాలో మోసాన్ని గుర్తించిన రైతులు
చర్ల: మండలంలో పత్తి వ్యాపారుల మోసాన్ని గుర్తించిన రైతులు వారికి దేహశుద్ధి చేశారు. మండలంలోని సింగసముద్రంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు మండలానికి చెందిన కొందరు పత్తి వ్యాపారులు ఇటీవల చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. గ్రామాల్లో తిరిగి రైతుల వద్ద నుంచి పత్తిపంటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సింగసముద్రంలో బుధవారం ఉదయం కొందరు రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేసి తీసుకొని వెళ్తున్నారు. పత్తి అమ్మిన రైతుల్లో కొందరు ముందుగానే వారి సొంత కాటాల ద్వారా పత్తిని కాటా వేసుకోగా వ్యాపారులు వేసిన కాటాలకు, రైతుల కాటాకు తేడా వచ్చింది. పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు తీసుకొని వెళ్తున్న సందర్భంలో రైతులు వారిని అడ్డగించి నిలదీసి, దేహశుద్ధి చేశారు. వారి పత్తిని తిరిగి తీసుకున్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ రాజువర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment