ఇల్లెందు మున్సిపాలిటీకి జాతీయ అవార్డు
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఈ మేరకు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ గురువారం ఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సీఎస్‌ఈ సునితా నార్నే చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లో భాగంగా శానిటేషన్‌లో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటంతో పాటు పౌరుల భాగస్వామ్యం పెంచడంలో విశేష కృషి చేసినందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేంజ్ మేకర్ కాంక్లేవ్–2024 అప్రియేషన్ సర్టిఫికెట్ అందజేశారు. రాష్ట్రం నుంచి 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అవకాశం దక్కగా అందులో ఇల్లెందు ఉండడం విశేషం. అంతేకాక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బుక్‌లెట్‌లోనూ ఇల్లెందుకు చోటు దక్కింది. అవార్డుకు ఎంపికవడం పట్ల ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment