అసాంఘిక శక్తులపై చర్యలు తప్పవు
కొత్తగూడెంఅర్బన్: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులతో పాటు గంజాయి అక్రమ రవాణా, మట్కా, బెట్టింగ్‌లు నిర్వహించే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీసి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. గత నెలలో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఇల్లెందు, మణుగూరు, డీసీఆర్బీ డీఎస్పీలు చంద్రభాను, రవీందర్ రెడ్డి, మల్లయ్య స్వామి, సీఐలు శ్రీనివాస్,ి రమాకాంత్, నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ హెడ్ కానిస్టే బుల్‌గా పనిచేస్తున్న బి.కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించగా ఆయన కుటుంబసభ్యులకు ఎస్పీ రోహిత్‌రాజ్ గురువారం రూ.8,58,320 చెక్కు అందజేశారు. భద్రతా విభాగం నుంచి ఎక్స్‌గ్రేషియా రూపంలో ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు. కోటేశ్వరరావు కుటుంబ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యానారాయణ, ఆర్‌ఐలు లాల్‌బాబు, కృష్ణారావు, జిల్లా కార్యాలయ ఏఓ అజ్మీరా మంజ్యా నాయక్, సూపరింటెండెంట్ సత్యవతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment