కార్మిక సంక్షేమమే బీఎంఎస్ లక్ష్యం
సింగరేణి(కొత్తగూడెం): కార్మికుల సంక్షేమం, పరిశ్రమ ప్రగతి దేశాభివృద్ధే బీఎంఎస్ లక్ష్యమని సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్, జాతీయ కార్యదర్శి పి.మాధవ నాయక్ పేర్కొన్నారు. శనివారం భారతీయ మజ్దూర్ సంఘ్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగూడెంలోని బీఎంఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో నిర్వహించే బీఎంఎస్ త్రైవార్షిక మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. బీఎంఎస్ నాయకులు కృష్ణారెడ్డి, టీఎస్ పవన్‌కుమార్, వెంకటరెడ్డి, మారేపల్లి శ్రీనివాస్, బి. సుందర్‌రావు, టి.నరేంద్రబాబు, ఏ.ఠాగూర్, అల్లి ప్రకాశ్, శివ కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కేజీబీవీ విద్యార్థినుల నిరసన
జూలూరుపాడు/చండ్రుగొండ: టీచర్లు సమ్మె చేస్తుండటంతో ఎలాంటి తరగతులు జరగడంలేదని విద్యార్థినులు శుక్రవారం కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. టీచర్లు తిరిగి విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు రామ్‌చరణ్, అనిల్, బాలాజీ, సాయితేజ తదితరులు మద్దతు తెలిపారు.
కనకగిరి గుట్టలను సందర్శించిన అధికారులు
చండ్రుగొండ: చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ శనివారం సందర్శించారు. గుట్టల పైభాగం వరకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. అలాగే, గుట్టల పైభాగంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులు, హస్తాల వీరన్నస్వామి ఆలయం నుంచి పులిగుండాల వరకు రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. డీఎఫ్‌ఓ వెంట తల్లాడ రేంజర్ ఉమ, డిప్యూటీ రేంజర్ సురేష్, బీట్ ఆఫీసర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
40 కేజీల గంజాయి స్వాధీనం
దుమ్ముగూడెం : మండలంలోని పెద్ద ఆర్లగూడెం శివారులో శనివారం రూ.10,06,250 విలువైన 40.25 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కథనం ప్రకారం.. ఎస్‌ఐ గణేష్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను గమనించి అటుగా వస్తున్న కారును డ్రైవర్‌కు వెనకకు తిప్పాడు. వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ దిగి పారిపోయాడు. పోలీసులు కారులో తనిఖీ చేయగా గంజాయి లభించింది. గంజాయి, కారును స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సామగ్రి దగ్ధం
పాల్వంచరూరల్: మండలంలోని యానంబైల్ గ్రామానికి చెందిన బుడగం నాగేశ్వరరావు ఇంట్లో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో సామగ్రి, రూ. 25 వేల నగదు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఆర్‌ఐ హచ్యా పరిశీలించి పంచనామా నిర్వహించారు. రూ.1.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
ఇద్దరిపై కేసు నమోదు
కొత్తగూడెంఅర్బన్: దాడి ఘటనలో ఇద్దరు వ్యక్తులపై శనివారం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శివప్రసాద్ కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో బూడిదగడ్డ ఏరియాకు చెందిన ఎండి.షరుబుద్దీన్‌పై అదే ఏరియాకు చెందిన ఇమ్రాన్, షాకీర్‌లు కర్రతో దాడి చేయగా తల పగిలింది. దీంతో స్థానికులు షరుబుద్దీన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
‘వందశాతం’ సాధించాలి
దుమ్ముగూడెం : పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాంధించాలని ట్రైబల్ వేల్పేర్ డీడీ మణెమ్మ సూచించారు. శనివారం ఆర్లగూడెం ఏహెచ్‌ఎస్ పాఠశాలలో ఆమె తనిఖీ చేశారు. మెనూ అమలు తీరును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. హెచ్‌ఎం కారం సోమశేఖర్, వార్డెన్ వసంతం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment