రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపించారు.
వెండి పళ్లెం బహూకరణ..
యూఎస్‌కు చెందిన సందీప్ – శాంతి దంపతులు రూ. 60 వేల విలువైన వెండి పళ్లెంను స్వామివారికి బహూకరించారు. వారి తరుపున బంధువులు ఆలయ అధికారులకు అందజేశారు. కాగా, ఈనెల 26న ఉదయం 8 గంటలకు ఆలయ హుండీలను లెక్కించనున్నట్లు ఈఓ రమాదేవి తెలిపారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
ఐడీఓసీలో ఘనంగా
సెమీ క్రిస్మస్ వేడుకలు
సింగరేణి(కొత్తగూడెం): ఐడీఓసీ కార్యాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ కేట్ కట్ చేసి మాట్లాడారు. శాంతి, సహనం, త్యాగం, ప్రేమ, కరుణకు తార్కణంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామని చెప్పారు. క్రీస్తు జీవనం అందరికి ఆచరణీయమన్నారు. ఆయన బోధనలు ప్రతీ ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తాయని, అందరూ ఐకమత్యంగా ఉంటూ ఎదుటివారిని క్షమించే గుణం అలవర్చుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, సీపీఓ సంజీవరావు, ఏఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలలో ఎస్పీ
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం సందర్శించారు. తరగతి, వసతి గదులతో పాటు బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ప్రతీ ఒక్కరు కష్టపడి చదవాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని హితవు పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ సీసీ నాగరాజు, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రెండు బంగారు పతకాలు కై వసం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్‌కె.రియాజ్ రెండు బంగారు పతకాలు సాఽధించాడు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వనజ, వైస్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు, పీడీ వెంకన్న తదితరులు అభినందించారు.
చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం నేరం
కొత్తగూడెంఅర్బన్: చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం నేరమని జిల్లా సంక్షేమ అధికారి ణి లెనినా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టవిరుద్ధంగా పిల్లలను దత్తత ఇచ్చిన, తీసుకున్న వారికి మూడేళ్ల శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. పిల్ల లను అమ్మిన, కొన్నవారికి సైతం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం దత్తత ప్రక్రియను చట్టబద్ధం చేసిందని, పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు సెంట్రల్ ఎడాప్షన్ రిసోర్స్ అథారిటీ వెబ్ సైట్‌లో సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు భద్రాచలం శిశుగృహ మేనేజర్(7893825921), సోషల్ వర్కర్(9949581435) నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment