ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు
పాల్వంచరూరల్ : లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పీవీఎస్. పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల సంస్థ ఓఎస్డీ వివేకానంద, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు సాగిన పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి నింపాయన్నారు. గురుకుల పాఠశాలలు చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాల్వంచకు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఓవరాల్ ఇన్‌చార్జ్ సట్ల శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.శ్రీనివాస్, టెక్నికల్ మేనేజర్ కె.వాసు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగిరెడ్డి యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు, మల్టీజోన్ ఆఫీసర్ కె.అలివేలు, జోనల్ అధికారులు స్వరూపరాణి, విద్యారాణి, ఖమ్మం డీసీఓ రాజ్యలక్ష్మి, వైస్ ప్రిన్సి పాల్ అన్వేష్, ఎన్.నాగేశ్వరరావు, ప్రిన్సిపాళ్లు కె.వెంకటేశ్వర్లు, కందాల లిల్లి, పద్మావతి, సునిత, రాజు, స్వరూపరాణి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా
భద్రాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు
అండర్–14 విభాగంలో భద్రాద్రి సత్తా..
పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోన్ల నుంచి హాజరైన క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అండర్ – 14 విభాగంలో భద్రాద్రి జోన్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. అండర్ – 17 విభాగంలో చార్మినార్ జోన్, అండర్ – 19 విభాగంలో జోగుళాబ గద్వాల్ జోన్ ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నాయి. వ్యక్తిగత చాంపియన్ షిప్‌ను అండర్ – 14లో ఎం.నితిన్, అండర్– 17లో కె.మల్లేష్, అండర్ – 19 లో బి.భానుప్రసాద్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment