పారా లీగల్ వలంటీర్లు ప్రజలకు వారధిగా ఉండాలి
కొత్తగూడెంఅర్బన్: పారా లీగల్ వలంటీర్లు ప్రజ లకు – న్యాయ సేవాధికార సంస్థలకు మధ్య వారధి గా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. వలంటీర్లకు శనివారం నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేసి ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా చూడాలని అన్నారు. ట్రైనర్లుగా నియమించిన న్యాయవాదులు వివిధ చట్టాల గురించి పారాలీగల్ వలంటీర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రామారావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్‌రావు, మారపాక రమేష్ కుమార్, పాండురంగా విటల్, సాదిక్ పాషా, నరేంద్రబాబు, జీకే.అన్నపూర్ణ, మహాలక్ష్మి, ఎన్.ప్రతిభ, నాగస్రవంతి, మెండు రాజమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment