● పోటీల్లో సత్తా చాటుతున్న ‘నవభారత్’
పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల జరిగిన జాతీయస్థాయి గణిత ఒలంపియాడ్‌లో సత్తా చాటారు. ఏటా నిర్వహించే సీఆర్.రావు స్టాటిస్టిక్స్ ఒలింపియాడ్‌లోనూ ప్రతిభ చూపారు. పదో తరగతి విద్యార్ధులు బోయపాటి శ్రీచైత్ర, నాగసాయి కృష్ణతేజ వరుసగా రెండు, నాలుగో స్థానంలో నిలవగా పద్మవిభూషణ్ సీఆర్.రావు జయంతి అయిన సెప్టెంబర్ 10న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో యూనివర్సిటీ వీసీ ఎంఎన్.రావు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇక హైదరాబాద్ రామాంతపూర్‌లో ఇటీవల నిర్వహించిన రీజనల్‌స్థాయి గణిత ప్రదర్శనలో నవభారత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 8వ తరగతి విద్యార్థులు డి.మనస్వి, బి.కార్తీక ఈ ప్రదర్శనలో బాస్కెట్ బాల్ ఆటలో గణిత సూత్రం అమలుపై ఎగ్జిబిట్ సమర్పించగా ప్రథమ బహుమతి లభించింది. అలాగే, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన జాతీయస్థాయి ఆర్యభట్ట గణిత చాలెంజ్ పరీక్షలో ఎం.డీ.ముద్దీర్, బి.షాన్‌ముఖ్, టి.జోషిత మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. నేషనల్ మ్యాథ్ ఫెయిర్ బెస్ట్ కోచ్‌గా వీరబ్రహ్మేందర్ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment