తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
అశ్వారావుపేటరూరల్: ఓ మూడేళ్ల బాలుడు తప్పిపోగా, ఫిర్యాదు అందుకున్న గంటల వ్యవధిలోనే పోలీ సులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని జమ్మిగూడేనికి చెందిన దానపోలు వీరాజ్ అనే మూడేళ్ల బాలుడిని ఏపీలోని చింతలపూడి మండలం కండ్రికగూడేనికి తన తాతాయ్య తాళ్ల వెంకటేష్ మద్యం మత్తులో శుక్రవారం మధ్యాహ్నం చెప్పకుండా తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో వదిలేసి వెళ్లాడు. బా లుడు లేకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి మంగరాజు పలుచోట్ల వెతికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన ఎస్‌ఐ యయాతి రాజు, సిబ్బంది విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ పరిసర గ్రామాలను అప్రమత్తం చేయగా, బాలుడు పాకలగూడెంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు చిన్నారిని తీసుకొచ్చి శనివారం సాయంత్రం తండ్రికి అప్పగించారు.
బస్సులో బంగారం చోరీ.. రికవరీ
అశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు హైర్ బస్సు శనివారం రాత్రి భద్రాచలం నుంచి మణుగూరు బయలుదేరుతుండగా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన మహిళ బ్యాగులో నుంచి పది తులాల బంగారం పోయింది. దీంతో ఆమె డ్రైవర్, కండక్టర్‌కు తెలపడంతో బస్సును బస్టాండ్‌లోనే ఆపి ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. ఓ మహిళ తప్పించుకుని పోతుండగా డ్రైవర్ కోటేశ్వరరావు గమనించి ఆమె బ్యాగ్‌లో పరిశీలించగా బంగారం దొరికింది. దీంతో బాధిత మహిళకు అప్పగించారు. అనంతరం చోరీకి పాల్పడ్డ మహిళను పోలీసులకు అప్పగించగా డ్రైవర్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment