అశ్వారావుపేట: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను అశ్వారావుపేట పోలీసులు శనివారం తహశీల్దార్ చల్లా ప్రసాద్‌కు స్వాధీన పరిచారు. అయితే నామమాత్రపు ఫైన్ విధించి వదిలేయడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశువుల వాహనం పట్టివేత
పాల్వంచరూరల్: మండల పరిధిలోని బీసీఎం ప్రధాన రహదారిపై సోములగూడెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం భద్రాచలం నుంచి పాల్వంచవైపు వస్తున్న పశువుల వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 11 పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. వాహనం డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
గీత కార్మికుడికి గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండా వీరయ్య శనివారం తాటి చెట్టుపై నుంచి గాయపడ్డాడు. కాళ్లు విరగడంతో స్థానికులు చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
పంచాయతీ కార్మికుడి మృతి
సుజాతనగర్: మండల పరిధిలోని సీతంపేట బంజర గ్రామానికి చెందిన బానోత్ వేణు (36) పదిహేనేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 6 నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం క్షీణించడంతో మనోవేదనతో ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment