నేడు ప్రజావాణి
సింగరేణి(కొత్తగూడెం): కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
టెక్నికల్ ఆఫీసర్
పోస్టులకు రాత పరీక్ష
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 21 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయాలని యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్ష నిర్వహించగా, ఏడుగురు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కోడూరి శ్రీనివాస్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment