ఉత్పత్తి లక్ష్యం సాధించాలి
మణుగూరు టౌన్: సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాలని జీఎం(ఈఅండ్‌ఎం) తిరుమల్‌రావు సూచించారు. ఆదివారం సింగరేణి మణుగూరు ఏరియాలోని కేసీహెచ్‌పీలో రక్షణ పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. కేసీహెచ్‌పీలో తీసుకుంటున్న రక్షణ చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. కేసీహెచ్‌పీ అధికారులు మదన్‌నాయక్ తదితరులను అభినందించారు. బహమతి అందించారు. ఈ కార్యక్రమంలో గాబ్రియల్ రాజు, వైద్యుడు సురేశ్, మహేంద్రనాఽథ్, హనుమంతగౌడ్, వెంకటేశ్వర్లు సతీష్ కుమార్, శ్రీనివాస్, కేసీహెచ్‌పీ అధికారులు సందీప్, రామకృష్ణ, పిట్ సెక్రటరీలు వర్మ, నాగరాజు, సేఫ్టీ కమిటీ నరేశ్, శివకుమార్, అక్బల్ అలీ, విజయ్‌కుమార్, కార్తీక్, నరేందర్, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment