పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి టీఎస్ ఐపాస్, టీఫ్రైడ్ కింద పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించా రు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన టీఎస్ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమ ల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని, దీంతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. వారికి అన్ని విధాలా అర్హతలు ఉంటే త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా టీఎస్ ఐపాస్, టీఫ్రైడ్ కింద పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్‌ఎంఈ, ముద్ర రు ణాల వంటి పథకాలు, డీఆర్‌డీఏ ద్వారా 35శాతం, 45 శాతం సబ్సిడీ పొందొచ్చని చెప్పారు. అలాగే టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన వివిధ అనుమతుల మంజూరు, పురోగతిని కలెక్టర్ సమీక్షిచారు. మినీ రైస్‌మిల్లులు, చేపల పెంపకం యూని ట్లు, ఆయిల్ పామ్, మేజ్ పరిశ్రమలు, కులవృత్తులకు చేయూత, రవాణా వాహనాలు తదితర పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేయాలని తద్వారా గిరిజనులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా అశ్వాపురం భారజల కర్మాగారం అణుజల ఉత్పత్తి అనంతరం మిగిలిన నీటిని వృథాగా వదిలేస్తున్నారని, ఆ నీళ్లు ఎంతో పోషక వి లువలతో కూడుకుని ఉంటాయి కాబట్టి ఆ నీటితో మినరల్ వాటర్ ప్లాంట్‌ను స్థాపించడం ద్వారా స్థానిక గిరిజనులు అభివృద్ధి చెందొచ్చని పేర్కొన్నా రు. కర్మాగారంలో ఫ్లైయాష్ ఉపయోగంతో ఇటుకల తయారీ పరిశ్రమలను నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి తిరుపత య్య, ఐపీఓ పృథ్వీ, జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, జిల్లా మైనింగ్ అధికారి దినేశ్, ఎల్‌బీఎం రామిరెడ్డి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారి రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment