చాపకింద నీరులా మత్తు పదార్థాల వాడకం
కొత్తగూడెంఅర్బన్: సమాజంలో మత్తు పదార్థాల వాడకం చాప కింద నీరులా పెరిగి పోతోందని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా అన్నారు. నషాముఖ్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన) కార్యక్రమంలో భాగంగా మాస్టర్ వలంటీర్లకు మత్తు పదార్థాల వినియోగం, నివారణపై సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం కొత్తగూడెం మున్సిపాలిటీ మీటింగ్ హాల్‌లో జరిగింది. స్వర్ణలత మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కి బానిసలుగా మారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లితండ్రులు పిల్లల కదలికల్ని పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అనంతరం స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్ శ్రీపాద మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి కార్యాచరణ ప్రణాళిక ద్వారా అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, చికిత్స, పునరావాస సెంటర్లు ఏర్పాటు చేసి, మత్తుకి బానిసలైన వారిని తిరిగి మామూలు మనుషులుగా తీర్చి దిద్దే అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు లక్ష్మిప్రసన్న, విజయ, కుమారి, అరుణ, కుమారి, న్యూ హోప్ అసోసియేషన్ సభ్యులు జోసెఫ్, శ్రీనివాస్, శ్రీశైలం, సిబ్బంది వరప్రసాద్, నరేశ్, ప్రవీణ్, రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment