ట్రాక్టర్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
కూసుమంచి: రైతులు నిలిపి ఉంచిన ట్రాక్టర్ ఇంజిన్లు, ట్రక్కులను చోరీ చేసి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను సోమవారం కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు ట్రాక్టర్ ఇంజిన్లు, 7 ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన నూకా వీరబాబు, దాసరి నాగరాజు, అదే జిల్లా గరిడేపల్లి మండలం, వెల్డండి గ్రామానికి చెందిన దేవర శ్రీధర్ ముఠాగా ఏర్పడి ట్రాక్టర్ ట్రక్కులు చోరీ చేస్తున్నారు. అందుకోసం రెండు ఇంజిన్లను కూడా చోరీ చేసి వాటి సాయంతో రైతులు పొలాల్లో, ఇళ్లకు దూరంగా నిలిపి ఉన్న ట్రక్కులను చోరీ చేస్తూ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో వారు ట్రాక్టర్లు వేసుకుని వస్తుండగా కూసుమంచిలోని కంకర మిల్లు వద్ద కూసుమంచి ఎస్‌ఐ వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారిని విచారించగా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూకల చిన్న సైదులు, చేగొమ్మ గ్రామానికి చెందిన బొల్లం సైదులుకు చెందిన ట్రక్కులను అప్పగించగా వారు ఒక్కో ట్రక్కును రూ.60 వేలకు విక్రయించినట్లు తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. వీరబాబు, నాగరాజు, శ్రీధర్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లితో పాటు కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మంరూరల్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ట్రక్కులను చోరీ చేసినట్లు వివరించారు. ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీశైలం, గోపి, రాంబాబు, రమేశ్‌ను సీఐ సంజీవ్ అభినందించారు. సమావేశంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఎస్‌ఐలు నాగరాజు, సంతోష్, జగదీశ్ పాల్గొన్నారు.
7 ట్రక్కులు, రెండు ఇంజిన్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment