పూబెల్లిని అభివృద్ధి చేయాలి
ఇల్లెందురూరల్: సహజ సిద్ధంగా ఉన్న అందాలకు పర్యాటక కళను జోడిస్తే పూబెల్లి అభివృద్ధి పథంలో పయనిస్తుందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్పష్టం చేశారు. మండలంలోని పూబెల్లి గ్రామాన్ని సోమవా రం ఆయన సందర్శించారు. గ్రామ పొలిమేరలో ఉన్న చెరువు వద్ద అధికారులు, గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పూబెల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను సమగ్రంగా వివరించారు. దీనికోసం తాను రూపొందించిన ప్రణాళికపై వారికి అవగాహన కల్పించారు. పర్యాటకుల విడిది, ఆహారం, పర్యటన, కాలక్షేపం తదితర అంశాల కోసం కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. స్థానిక అధికారులు, గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధన్‌సింగ్, డీటీ కిషోర్, ఆర్‌ఐ ఆదినారాయణ, కామేశ్వరరావు, సర్వేయర్ ప్రియాంక, సెర్ప్ ఏపీఎం దుర్గారావు, సీసీ ఖమ్మంపాటి నర్సింహారావు, పంచాయతీ కార్యదర్శులు బాలకృష్ణ, అజహర్, సందీప్, స్థానికులు మూతి ముత్యాలు, ఉమారాణి, జోగ శ్రీకాంత్, ఎట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment