భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. రూ. 1,71,20,321 నగదుతో పాటు 92 గ్రాముల బంగారం, కేజీ 485 గ్రాముల వెండి లభించాయని ఈఓ రమాదేవి వెల్ల డించారు. ఇంకా యూఎస్‌ఏ డాలర్లు 923, అస్ట్రేలియా డాలర్లు 165, సింగపూర్ డాలర్లు 12, కెనడా నగదు 20, ఇంగ్లండ్ పౌండ్లు 5 తదితర విదేశీ నగదు వచ్చిందని పేర్కొన్నారు. గత నవంబర్ 7న హుండీలు లెక్కించగా.. 53 రోజుల తర్వాత తిరిగి తెరిస్తే ఈ మొత్తం లభ్యమైందని వివరించారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ..
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సోమవారం ముత్తంగి రూపంలో అలంకరించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నిత్యాన్నదానానికి వితరణ..
ఆలయ సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌కు చెందిన బాపురావు, సుబ్బాయమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందించారు.
రామాలయంలో హుండీల లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment