పెద్దమ్మతల్లి ఆలయంలో ‘నూతన’ సందడి
అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కాగా, అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న
అదనపు కలెక్టర్..
నూతన సంవత్సరం సందర్భంగా పెద్దమ్మతల్లి అమ్మవారిని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఈఓ రజనీకుమారి వారికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు.
కిన్నెరసానిలో సందడి
పాల్వంచరూరల్ : నూతన సంవత్సరం సందర్భంగా కిన్నెరసానిలో పర్యాటకులు బుధవారం సందడి చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 1,270 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.43,120 ఆదాయం లభించగా, 500 మంది బోటు షికారు చేయడంతో పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.27, 220 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment