సీసీ.. పోలీస్‌తో సమానం
● నిఘా నేత్రాల వినియోగం పెంచాలి ● ఎస్పీ రోహిత్‌రాజ్
మణుగూరు టౌన్: సీసీ కెమెరా ఒక పోలీసు సిబ్బందితో సమానమని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. వ్యాపార సముదాయాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, నివాసాల్లో సీసీ కెమెరాల వినియోగం పెంచి నేర నియంత్రణలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. మణుగూరు పోలీస్‌స్టేషన్‌తో పాటు పట్టణంలోని పలు ప్రధాన ఏరియాల్లో ఏర్పాటు చేసిన 92 సీసీ కెమెరాలను, రెండు ఆటోమెటిక్ నంబర్ రికగ్నైజేషన్ కెమెరాలను(ఏఎన్‌పీఆర్)లను శనివారం ఆయన ప్రారంభించారు. మణుగూరు పట్టణం దినదినాభివృద్ధి చెందుతోందని, సీసీ కెమెరాల వినియోగంతో నేరాలను నియంత్రణతో పాటు తప్పులను గుర్తించే వీలు కలుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనాలను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఐ సతీష్ శనివారం రాత్రి పట్టణంలోని వ్యాపారులతో మాట్లాడి సీసీ కెమెరాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు.
ఆదివాసీలకు అండగా ఉంటాం
పినపాక: వలస గొత్తికోయ గ్రామాల ఆదివాసీలకు పోలిస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. వలస ఆదివాసీ గ్రామాలైన తెర్లాపురం, మల్లారం, పిట్టతోగు గ్రామస్తులకు శనివారం వైద్య శిబిరం నిర్వహించగా ఎస్పీ ప్రారంభించారు. పిల్లలను బడికి పంపిస్తేనే ఆదివాసీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. బడీడు పిల్లలను పనులకు పంపితే ప్రభుత్వం నుంచి అందే పథకాలను రద్దు చేస్తామని చెప్పారు. అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని, వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో దుప్పట్లు, ఎల్‌ఈడీ బల్బులు, పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment