స్నేహితుడిని రక్షించబోయి..
కల్లూరురూరల్: సెల్ఫీ తీసుకు నే క్రమంలో సాగర్ కాల్వలో పడిపోయిన స్నేహితుడిని రక్షించేందుకు దిగిన యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆదివారం సెలవు కావడంతో కల్లూరుకు చెందిన కల్యాణ్, గోకవరం గ్రామానికి చెందిన పరిమి శివ సాగర్, ఎదుకూరి సంపత్ ప్రధాన కాల్వ వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఎదుకూరి సంపత్ ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడగా తన స్నేహితుడిని రక్షించే క్రమంలో పరిమి శివ కాల్వలో దిగాడు. ఈ ఘటనను చూసిన సమీపంలోని కొందరు సంపత్‌ను రక్షించగలిగారు. కానీ, పరిమి శివ మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక గజ ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా శివ ఆచూకీ లభ్యం కాలేదు. సాగర్ కాల్వ ప్రవాహాన్ని నిలిపివేసేందుకు పోలీసులు సంబంధిత శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ అధికారులు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు కూడా సాగర్‌నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కాగా, పరిమి శివ తండ్రి గతంలోనే చనిపోయాడు. తల్లి పరిమి విజయమ్మ, సోదరితో కలిసి శివ ఉంటున్నాడు. విజయమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పరిమి శివ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎస్‌ఐ హరిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ కాల్వలో గల్లంతైన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment