సుందర రూపం.. బలరామావతారం
భద్రాచలం : శేష తల్పమున సేద తీరి రెండు చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో నాగలి, గదతో దర్శనమిచ్చిన బలరామావతారం బహుసుందరమని కొనియాడుతూ భక్తులు జేజేలు పలికారు. శ్రీహరికి శయన అయిన ఆదిశేషుని అంశతో జన్మించి, శ్రీకృష్ణునికి అన్నగా ఆయనకు ధర్మస్థాపనలో సహకరిస్తూ, అపర పరాక్రముడిగా పేరొందిన బలరాముడి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మంగళవారం ఈ రూపంలో అలంకరించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, సుప్రభాతం, ఆరాధన తదితర సేవలు జరిపించారు. బలరామావతారంలో అలంకరించిన స్వామివారిని భక్తుల సందర్శనార్థం కాసేపు బేడా మండపంలో వేంచేపు చేశారు. అనంతరం బాజాభజంత్రీలు, కోలాటాల నడుమ మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అర్చకులు స్వామి వారికి నైవేద్యం, హారతి సమర్పించాక, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. తిరువీధి సేవ అనంతరం స్వామివారిని తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.
నేడు వైభవంగా ఊంజల్ సేవ
Comments
Please login to add a commentAdd a comment