కిన్నెరసాని అభయారణ్యంపై ప్రచారం చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
8లో
400 రకాల జంతువులు, పక్షులు..
కొత్తగూడెంలో జూ పార్క్ ఏర్పాటుకు ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని హరిత టూరిజం హోటల్ వెనక భాగంలో 260 ఎకరాలు, సింగరేణి గెస్ట్‌హౌస్ పక్కన కార్తీకవనం వెనుక భాగంలో 225 ఎకరాల స్థలాలను నిపుణుల బృందం పరిశీలించింది. జూ పార్కుకు ఈ రెండు స్థలాలు కూడా అత్యంత అనువుగా ఉన్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండింటిలో ఎదో ఒక స్థలానికి మాత్రమే సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు ఇస్తుంది. జూ పార్క్ ఏర్పాటుకు సంబంధించి నిధులు, జంతువులు, పక్షుల సేకరణ వంటి ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి పంపాలని అటవీ అధికారులకు నిపుణుల బృందం సభ్యులు సూచించారు. జూ పార్క్‌లో 400 వరకు జంతువులు, పక్షులను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. సామాన్య ప్రజలు, పర్యాటకులకు వన సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జంతు ప్రదర్శనశాలలు దోహదపడుతుంటాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులతో పాటు వివిధ జాతుల మొక్కలను కూడా పెంచుతారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హైదరాబాద్, విశాఖపట్టణం, తిరుపతి, హనుమకొండ నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చిరుత, జింకలు, నల్ల హంస, కొండగొర్రే, లేళ్లు, దుప్పులు, కోతులు, మనుబోతు, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి పిల్లి తదితర జంతువులతో పాటు చిలుకలు, పావురాలు, కనుజులు, నిప్పుకోళ్లు, నెమళ్లు వంటి పలు రకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్ల వంటి సరీసృపాలను సంరక్షిస్తున్నారు. త్వరలో జిల్లాలో ఏర్పాటు చేయనున్న జూ పార్క్‌లోనూ ఆయా జంతువులు, పక్షులను సేకరించనున్నారు. నిత్యం 500 మంది పర్యాటకులు తిలకించేందుకు వీలుగా వసతులు సమకూర్చుతారు. అన్ని అనుమతులు లభిస్తే కొత్తగూడెంలో ఏడాదిన్నరలోపు జూపార్క్‌ను అందుబాటులోకి తేవాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment