అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య శనివారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి భోదించి మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్ర గ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి. ఈ సందర్బంగా బేడా మండపంలో కృష్ణావతారంలో ఉన్న స్వామివారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment