పీహెచ్‌సీలో తనిఖీ
దుమ్ముగూడెం : మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం పీహెచ్‌సీలను డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠ ఏకా దశి ఉత్సవాల సందర్భంగా పర్ణశాలలో ఏర్పాటు చేసే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలని సూచించారు. ఐఎల్‌ఆర్ గదులను పరిశీలించి నిర్దేశిత టెంపరేచర్లలోనే వ్యాక్సిన్లు భద్రపరచాలని అన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చైతన్య, సీసీ పాయం శ్రీను, వైద్యాధికారులు పుల్లారెడ్డి, రుక్మాకర్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment