కారు, బైక్ ఢీ..
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని రుద్రంపూర్ జాతీయ రహదారిపై కారు, బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఆదివారం రామవరం టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను బంధువులు, స్థానికుల ఇలా తెలిపారు. రుద్రంపూర్ నుంచి కొత్తగూడెంకు బైక్‌పై అదే ప్రాంతానికి చెందిన వి.ప్రభుకుమార్, ఇ.శివ, సాయి అనే ముగ్గురు యువకులు కొత్తగూడెంకు వెళ్తున్నారు. ఈక్రమంలో విజయవాడ నుంచి వస్తున్న కారు రుద్రంపూర్ పార్కు సమీపంలోకి రాగానే ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై వస్తున్న యువకులకు గాయాలు కాగా స్థానికులు పోలీసులు, 108కు సమాచారం అందించి వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక యువకుడికి తీవ్రగాయం కాగా ఖమ్మానికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు పేర్కొన్నారు.
చెరకు ట్రాక్టర్ తగిలి ఇద్దరికి గాయాలు
నేలకొండపల్లి: చెరకు ట్రాక్టర్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన ఎస్.వెంకన్న, జర్పుల హనుమంతు ఆదివారం రాత్రి నేలకొండపల్లి నుంచి ఇంటికి వెళ్తున్నారు. గ్రామంలోకి రాగానే అటు నుంచి ఫ్యాక్టరీకి వస్తున్న ఓ చెరకు ట్రాక్టర్ బైక్‌కు తగిలింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురు యువకులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment