సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా ఓటర్ల తుది జాబితా వివరాలను అధికారులు సోమవారం వెల్ల డించారు. జిల్లాలో 9,95,150 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4,81,985 మంది పురుషులు, 5,12,364 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 64 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 737 మంది ఉన్నారు. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 30,379 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 2024 అక్టోబర్ 29 నాటికి 9,91,114 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇటీవల కొత్తగా 7,680 మంది ఓటర్లను చేర్చగా, 4,381 మంది ఓట్లను పరిశీలించి తొలగించారు. దీంతో 2025 జవవరి 6 వరకు 9,94,413 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరికి సర్వీస్ ఓటర్ల సంఖ్య 737 కలిపితే మొత్తం 9,95,150కు చేరింది.
తుది జాబితా విడుదల చేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment