ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి పెట్టండి
అదనపు కలెక్టర్ విద్యాచందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రమాదేవితో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని..
● కొత్తగూడెం మున్సిపాలిటీ మధురబస్తీలో నివాసం ఉంటున్న ఎంఏ రియాజ్ విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు నెల రోజులు దాటినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, పారదర్శకతతో సమాచారం ఇప్పించాలని చేసిన దరఖాస్తును సీ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
● సుజాతనగర్ మండలం లక్ష్మీపురం తండాలో నివాసం ఉంటున్న బోడ రామ అనే రైతు.. ఆర్‌ఓఎఫ్‌ఆర్ అటవీ హక్కుల పట్టా పాసు పుస్తకం కలిగి ఉన్నానని, తనకు ఉన్న ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమిలో ఉపాధిహామీ పథకం ద్వారా 20 సంవత్సరాల క్రితం టేకుచెట్లు వేశామని, అవి పెద్దగా పెరగడంతో పంటల దిగిబడి రావడం లేదని, ఉన్న 30 చెట్లను నరికి అమ్ముకోవడానికి అనుమతి ఇప్పించాలని చేసిన దరఖాస్తును ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
● ఇల్లెందు మండలం మామిడిగుండాలకు చెందిన రామ్మోహనరావు.. గ్రామంలో సర్వే నంబర్లు 130/2డీ/5/1, 105/3, 80, 81, 130/2డీ/5/3లో ఉన్న వారసత్వ భూమిలో కొందరు అక్రమంగా బోర్లు వేస్తున్నారని, వాటిని నిలిపివేయించాలని దరఖాస్తు చేయగా ఇల్లెందు తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment