మెరుగైన ఫలితాలు సాధించాలి
బూర్గంపాడు/అశ్వాపురం/పినపాక : ఇంటర్మీడియట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి సూచించారు. డీఐఈఓ హెచ్. వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, ప్రగతి నివేదికలతో పాటు అధ్యాపకుల బోధన తీరును, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ సిలబస్ త్వరగా పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని లేకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాయుతంగా చదువుకోవాలని సూచించారు. అశ్వాపురం కళాశాలకు చెందిన ఎస్‌కే అమ్రీన్ ఇటీవల సీఎం కప్‌లో జావెలిన్‌త్రోలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా యాదగిరి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు చీన్యా, శేషుబాబు, సత్యనారాయణ, అధ్యాపకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, ముకుందం, సత్యేంద్రకుమార్, మూర్తి, నరేష్, లక్ష్మీదీపిక, సాహితి, జరీనా తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు
డిప్యూటీ సెక్రటరీ యాదగిరి
Comments
Please login to add a commentAdd a comment