‘కార్పొరేషన్’ నా చిరకాల వాంఛ
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేషన్, విమానాశ్రయం ఏర్పాటు తన చిరకాల వాంఛ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన విషయం విదితమే. ఇందుకోసం కృషి చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, ఉప ముఖ్యమత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూలమొక్కలను అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం ప్రాంత అభివృద్ధి కార్పొరేషన్ వల్లే సాధ్యమని గుర్తించి ఏడాది కాలంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. గరీబ్‌పేట కేంద్రంగా త్వరలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment