తల్లిని చూసేందుకు వెళ్తూ..
వేంసూరు: సెలవు వచ్చిందని తల్లిని చూసేందుకు వెళ్తూ మార్గ మధ్యలో తనయుడు మృతి చెందిన ఘటన వేంసూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లికి చెందిన ఎస్‌కే అఫ్జల్ హుస్సేన్ (20) సత్తుపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు. సత్తుపల్లి హనుమాన్‌నగర్‌కు చెందిన తన పెదనాన్న సైదులు ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం నూజివీడులో ఉంటున్న తన తల్లి జరీనాను చూసేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మండలంలోని పెట్రోల్ బంక్‌లో తన ఎక్స్‌ఎల్ మోపెడ్‌లో పెట్రోల్ పోయించుకున్న రావిలాల నాగేశ్వరరావు ప్రధాన రహధారి పైకి రాగానే రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. అఫ్జల్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ వీర ప్రసాద్ తెలిపారు. అఫ్జల్ తండ్రి షాజమాన్ 2009లో మృతి చెందిగా రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతితో తల్లి రోదనలు మిన్నంటాయి.
రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment