దమ్మపేట మండలంలో నిబంధనలు ఉల్లంఘించి అసైన్డ్ భూములను గిరిజనేతరులు పట్టాలు చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఏర్పాట్లు చివరి దశలో..
10లో
భద్రాచలంటౌన్: భద్రాద్రిలో రివర్ ఫెస్టివల్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న తాత్కాలిక విడిది గృహాలు, వివిధ గిరిజన వంటకాలు, గిరిజన కళాఖండాల స్టాళ్లు, బోటింగ్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతమంతా విద్యుత్ కాంతులు వెదజల్లేలా సోలార్ లైట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టూ ఉన్న గోదావరి అందాలను ఫొటోలు తీసుకునేలా సెల్ఫీ పాయింట్ నిర్మించామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణమంతా వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆలయ ఈఈ రవీందర్‌ను ఆదేశించారు. అనంతరం గోదావరిలో బోటులో విహరించి పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment