‘ప్రతిభ’ పరీక్షకు 292 మంది హాజరు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో శనివారం జరిగిన ప్రతిభా పాటవ పరీక్షకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి 292 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షను పరిశీలించిన డీఈఓ వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ దేశానికి ఉత్తమ పౌరులను అందించేది సాంఘిక శాస్త్రమేనని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మరింతగా కృషి చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ సోషల్ టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏసీజీఈ మాధవరావు, ఎస్‌ఓ సైదులు, సోషల్ ఫోరం అధ్యక్షుడు బి.తారాచంద్, ప్రధాన కార్యదర్శి ఎల్. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
దుమ్ముగూడెం : పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులు వంద శాతం ఉత్తీర్ణత సాఽధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ సూచించారు. మండలంలోని రేగుబల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీల్లో చైర్మన్ పరిశీలన
దమ్మపేట: తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి శనివారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలను పరిశీలించారు. గెలల కాడలు తక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. గెలల క్రషింగ్, విస్తరణ పనులతో పాటు యంత్రాల పనితీరును తనిఖీ చేశారు. యంత్రాలకు సకాలంలో మరమ్మతులను నిర్వహించాలని అన్నారు. ఫ్యాక్టరీ సమగ్ర నివేదికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ ఆకుల బాలకృష్ణ, మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment