దుమ్ముగూడెం : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేసేలా రివర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న బొజ్జిగుప్ప గ్రామాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి భద్రాచలం వచ్చే భక్తులకు గిరిజనుల సంస్కృతి, పాతకాలపు కట్టడాలు, వారి జీవనశైలిని తెలియజేసేలా రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. ఈనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్ నుంచి ఒక బృందాన్ని రప్పిస్తున్నామని, భద్రాచలంలో ఏర్పాటు చేసే విడిది కేంద్రంలో బసచేసి, తెల్లవారి బొజ్జిగుప్ప గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
ిసంగరేణి(కొత్తగూడెం): రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు చేపట్టాలని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచా రం కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌రావు సూచించారు. శనివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పా రు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించి అవసరమైన చోట సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ రెహమాన్, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ వెంకటేశ్వరాచారి, ఇందిర పాల్గొన్నారు.
గృహోపకరణాల పరిశీలన..
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో డీఆర్డీఏ, ఎంఎస్‌ఎంఈ, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, గృహోకరణాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముక్కోటికి భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు గిరిజన సంస్కృతిని తెలియజేసేలా ప్రత్యేకమైన గిరిజన వంటకాలు తయారు చేయాలని, గృహోపకరణాలను కొనుగోలు చేసేలా ప్రత్యేక డిజైన్‌లతో ప్యాక్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, జేడీఎం హరికృష్ణ, ప్యాకింగ్ డిజైనర్స్ కీర్తన, కల్పన, అనురాధ పాల్గొన్నారు.
డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి
కొత్తగూడెంరూరల్: సర్వజన ఆస్పత్రిలో డ్రెయినేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పాటిల్ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఈ పనులతో పాటు డయాలసిస్ వార్డును పరిశీలించారు. క్యాజువాలిటలో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్‌ఎంఓ రమేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment