ఏఎస్పీగా విక్రాంత్ బాధ్యతల స్వీకరణ
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మొదట ఏఎస్పీ కార్యాలయానికి చేరుకున్న విక్రాంత్.. మూడు నెలలుగా ఇన్‌చార్జ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వంగా రవీందర్‌రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విక్రాంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తిస్తూ భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. కాగా జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ప్రొబెషనరీ విధుల నిర్వహణలో భాగంగా జిల్లాలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా 2024 మార్చి 4 నుంచి మే 25 వరకు పని చేశారు. అనంతరం ట్రైనింగ్ కోసం తిరిగి జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లగా శిక్షణ అనంతరం భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భద్రాచలం డివిజన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా పనిచేస్తానని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాల ని కోరారు. అనంతరం సీఐ సంజీవరావు, ఎస్‌ఐలు పీవీఎన్ రావు, విజయలక్ష్మి, మధుప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment