పోలీసు వ్యవస్థకు వన్నె తీసుకురావాలి
● కమిషనర్ సునీల్‌దత్ ● గంగారం బెటాలియన్‌లో సిబ్బంది పాసింగ్ ఔట్ పరేడ్
సత్తుపల్లి టౌన్: విధినిర్వహణలో అంకితభావం, ధైర్యసాహసాలు, శ్రద్ధ కనబరుస్తూ పోలీసు వ్యవస్థకు వన్నె తీసుకొచ్చేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక బెటాలియన్‌లో 297 మంది కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలలుగా ఇస్తున్న శిక్షణ పూర్తయింది. ఈ సందర్భంగా పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించగా వారి నుంచి సీపీ, బెటాలియన్ కమాండెంట్ పి.చటర్జీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాల్లో విధుల్లో అమలుచేస్తూ రాణించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ చట్టాలకు అనుగుణంగా నిజాయితీగా విధులు నిర్వర్తిస్తే శాఖతో పాటు వ్యక్తిగతంగా పేరు వస్తుందని తెలిపారు. ఆతర్వాత శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి సీపీ బహుమతులు అందజేశారు. అడిషనల్ కమిషనర్ విజయ్‌బాబు, ఏసీపీ రఘు, బెటాలియన్ అసిస్టెంట్ డైరెక్టర్ దామోదర్‌రెడ్డి, అసిస్టెండ్ కమాండెంట్లు శ్రీధరరాజా, రంగారెడ్డి, సీఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment